: హైదరాబాద్ బస్సుల్లో పురుషులు, మహిళల సీట్ల మధ్య ఇనుపకంచెలు!


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా సమస్యల అధ్యయన కమిటీ ఇటీవల హైదరాబాదులో మహిళల భద్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. తాజాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికలోని సిఫార్సులను ఒక్కొక్కటిగా అమలు చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే, ఆర్టీసి బస్సులలో పురుషుల సీట్లకు, మహిళల సీట్లకు మధ్య ఇనుప కంచె లేదా రాడ్ లాంటి పార్టిషన్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనిని విజయదశమిని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ఆరంభించింది. సికింద్రాబాద్ నుంచి ఆప్జల్ గంజ్ వరకు వెళ్లే ఆర్టీసీ బస్సులలో పాక్షికంగా పురుషుల సీట్లు, మహిళల సీట్ల మధ్య ఇనుపకంచెను ఏర్పాటు చేశారు. దీంతో, మహిళలకు ఆకతాయిల బాధ తప్పుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రయోగం సఫలమయితే, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఇనుపకంచెలను ఏర్పాటు చేస్తారు.

  • Loading...

More Telugu News