: మరో బ్రిటన్ పౌరుడిని బలి తీసుకున్న ఇస్లామిక్ తీవ్రవాదులు
ఇస్లామిక్ మిలిటెంట్లు మరో బ్రిటన్ పౌరుడిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. తమ బందీగా ఉన్న బ్రిటన్ పౌరుడు అలన్ హెన్నింగ్స్ ను దారుణంగా హతమార్చిన వీడియోను మిలిటెంట్లు శుక్రవారం విడుదల చేశారు. దీంతో ఇద్దరు బ్రిటన్ పౌరులను మిలిటెంట్లు హత్య చేసినట్లైంది. మిలిటెంట్ల తాజా దుశ్చర్యపై బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పౌరులను చంపేస్తున్న మిలిటెంట్లను వేటాడి తీరతామని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే, తమ బందీగా ఉన్న అమెరికా యుద్ధ నిపుణుడు పీటర్ కిస్సింగ్ ను కూడా హతమారుస్తామని తాజాగా వీడియోలో మిలిటెంట్లు ప్రకటించారు.