: నేడు తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జన్మభూమి-మన ఊరు కార్యక్రమాలను ప్రారంభించనున్న చంద్రబాబు, మధ్యాహ్నం జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనపర్తి పట్టణంలోని దేవీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనమవుతారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.