: ‘మహా’ సంగ్రామంలో నేడు మోడీ 'సింహగర్జన'!


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తన తురుపు ముక్కను నేడు బరిలోకి దింపుతోంది. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారు. 'సింహగర్జన' పేరిట నేడు ముంబై నగరంలో జరగనున్న ర్యాలీలో మోడీ పాల్గొంటారు. శివవసేనతో తెగదెంపులు చేసుకున్న దరిమిలా, ఆ పార్టీపై కాని, పార్టీ నేతలపై కాని మోడీ ఆరోపణలు చేయరని, కేవలం ఛత్రపతి శివాజీ పేరును ప్రస్తావిస్తూ ముందుకు సాగుతారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన ముంబై వస్తున్న నేపథ్యంలో ఈ ర్యాలీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే, శివసేనతో తెగదెంపుల నేపథ్యంలో బీజేపీ తన అస్త్రాలన్నింటినీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వినియోగించేందుకు సిద్ధమైంది. పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీతో పాటు, పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీలు హేమమాలిని, వినోద్ ఖన్నా, శత్రుఘ్నసిన్హా తదితరులు కూడా ప్రచారంలో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News