: పండగ అంతా సవ్యంగా జరిగిందనుకున్నంతలో...దారుణం
విజయదశమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయనుకుంటున్న దశలో దారుణం చోటుచేసుకుంది. బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో రావణ దహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనికి లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ఉత్సవాలు ముగిసిన సందర్భంలో అందరూ ఒకేసారి మైదానం బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 32 మంది మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. కొందరు ఆకతాయిలవల్ల తోపులాట చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో దసరా ఉత్సవాలు విషాదాంతమయ్యాయి.