: పాక్ దుశ్చర్య...బాలిక మృతి
కుక్క తోక వంకరలా పాకిస్థాన్ వక్రబుద్ధి చూపిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై నంగనాచి కబుర్లాడుతున్న పాక్, రెచ్చగొట్టే చర్యలకు అడ్డుకట్ట వేయడం లేదు. విజయదశమి సందర్భంగా భారత భద్రతా బలగాలు ఏమరుపాటుగా ఉంటాయని భావించిన పాక్ సైన్యం, జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో 12 ఏళ్ల బాలిక మృతి చెందగా, ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. గత వారం రోజుల్లో పాక్ కాల్పులకు తెగబడడం ఇది మూడోసారి.