: విజయ దశమినాడు విషాదం
విజయదశమి రోజున ఓ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలోని సౌఖ్య లాడ్జి సమీపంలో పార్కింగ్ చేసి ఉన్న కారులోకి దత్తు అనే మూడేళ్ల పిల్లాడు ఆడుకుంటూ వెళ్లాడు. కారులోపలికి పిల్లాడు వెళ్లిన తరువాత కారు డోర్లు లాక్ అయిపోయాయి. అయితే, డోర్లు ఎలా తీయాలో తెలియకపోవడంతో దత్తు ఊపిరాడక మృతి చెందాడు. దీంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.