: ప్రణబ్, మోడీ, అద్వానీ, సోనియా, మన్మోహన్ సింగ్ కలిశారు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ ఆన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకే వేదికపై కనువిందు చేశారు. ఢిల్లీలోని సుభాష్ మైదాన్ లో విజయదశమిని పురస్కరించుకుని జరిగిన రావణ దహన కార్యక్రమంలో వీరంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. దేశ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ, హమీద్ అన్సారీ, మోడీ, అద్వానీ, సోనియా, మన్మోహన్ సింగ్ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రావణ దహనంతో కార్యక్రమం పూర్తయింది.