: ఈ దఫా ఆసియా క్రీడల్లో భారత్ కు నిరాశ... 8వ స్థానంతో ముగింపు


17వ ఆసియా క్రీడలను భారత్ 8వ స్థానంతో ముగించింది. 11 స్వర్ణాలు, 9 రజతాలు, 37 కాంస్యాలను ఈ దఫా ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు గెలుచుకున్నారు. ఆఖరి రోజున కబడ్డీ ఈవెంట్ లో పురుషులు, మహిళల జట్లు రెండు పసిడి పతకాలు సాధించడంతో మన దేశం టాప్ 10 స్థానం సంపాదించగలిగింది. వరుసగా ఏడోసారి ఆసియా క్రీడల్లో పురుష కబడ్డీ జట్టు బంగారు పతకం గెలుచుకుని సంచలనం సృష్టించింది. అయితే, మొత్తంగా చూస్తే ఆసియా క్రీడలు భారత్ కు నిరాశనే మిగిల్చాయని చెప్పాలి. 2010లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ ఆరో స్థానాన్ని సాధించింది. అప్పట్లో మనదేశం 14 స్వర్ణాలు, 17 రజతాలు, 31 కాంస్యాలు గెలుచుకుంది. గతంతో పోలిస్తే, భారత్ స్థానం మరింత మెరుగుపడుతుందని ఈ గేమ్స్ ప్రారంభానికి ముందు క్రీడాభిమానులు అశించారు. అయితే, అందుకు విరుద్ధంగా రెండు స్థానాలు దిగజారడంతో క్రీడాలోకాన్ని నిరాశపరిచింది.

  • Loading...

More Telugu News