: దూరమైన నందమూరి అభిమానులకు మళ్లీ దగ్గరయ్యేందుకు వైజాగ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్


నందమూరి ఫ్యామిలీ అభిమానులకు, టీడీపీ క్యాడర్ కు మరింత దగ్గరయ్యేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండడంతో పాటు... టీడీపీకి, నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉండటం వల్ల అభిమానులు దూరమవుతున్నారనే విషయాన్ని ఎన్టీఆర్ గుర్తించినట్టు సమాచారం. దీంతో, తన అభిమానగణానికి మళ్లీ దగ్గరయ్యేందుకు అతి త్వరలో వైజాగ్ లో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేయనున్నాడని తెలుస్తోంది. నందమూరి ఫ్యామిలీ ఫాన్స్ తో పాటు తెలుగుదేశం యూత్ కేడర్ ని కూడా ఈ మీట్ కు ఆయన ఆహ్వానించనున్నాడని సమాచారం. ఈ మీట్ లో, ఫ్యాన్స్ అందరితో స్వయంగా మాట్లాడి వారిని ఉత్సాహపరిచే సన్నాహాల్లో ఎన్టీఆర్ ఉన్నాడని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. తన సినిమాలకు సంబంధించి సలహాలు తీసుకోవడంతో పాటు వారితో ఫోటో సెషన్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొననున్నాడని సమాచారం.

  • Loading...

More Telugu News