: బస్తీలను కూల్చేందుకు బుల్ డోజర్లు పంపించే ప్రభుత్వం కాదు మాది: కేసీఆర్
హైదరాబాద్ నగరంలో లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. వీటిని త్వరలోనే స్వాధీనం చేసుకుని, 20వేల కోట్లతో బస్తీల్లోని పేదలకు పక్కా ఇళ్లను కట్టిస్తామని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వాల తరహాలో బస్తీలను కూల్చేందుకు బుల్ డోజర్లను పంపించమని ఆయన అభయమిచ్చారు. హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం ఆయన బల్కంపేట-బేగంపేట లింక్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన అనంతరం ఐడి కాలనీలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో దొరలెవరో, దొంగలెవరో తేలిందని ఆయన తెలిపారు.