: బాబు తొలి అడుగేశారు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి అడుగు ఇప్పుడేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజమే, ఆయన కొత్త ఆఫీస్ లో తొలిసారి అడుగు పెట్టారు. సచివాలయంలోని ఎల్ బ్లాక్ లోని 8వ అంతస్థులో ఏపీ సీఏం కోసం కేటాయించిన ఛాంబర్ లో ఆయన ప్రవేశించారు. విజయదశమి రోజున సుముహూర్తాన వేద మంత్రాలు, మేళ తాళాల మధ్య ఆయన ఆఫీస్ లో ప్రవేశించారు. ఇక నుంచి ఆయన అక్కడి నుంచే విధులు నిర్వర్తించనున్నారు. ఇంత వరకు లేక్ వ్యూ అతిథి గృహం నుంచి ఆయన కార్యకలాపాలు సాగించారు.