: ఎయిడ్స్ వైరస్ జన్మస్థలం...కాంగో రాజధాని కిన్షాసా!


ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ కు కారణమవుతున్న హెచ్ఐవీ వైరస్ పుట్టుకతో పాటు మానవుడికి సంక్రమించిన వైనంపై కీలక ఆధారాలు వెల్లడయ్యాయి. మధ్య ఆఫ్రికాలో కాంగో రాజధాని కిన్షాసాలో హెచ్ఐవీ వైరస్ పుట్టిందని సుదీర్ఘ పరిశోధనల తర్వాత శాస్త్రవేత్తలు తేల్చారు. అంతేకాక, ఈ వైరస్ 1920 నాటి నుంచి కూడా తన ప్రభావం చూపుతూనే ఉందని కూడా తేలింది. దాదాపు 30 ఏళ్లుగా శరవేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్, ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనలకు గురి చేసిన సంగతి తెలిసిందే. వేటాడిన జంతువుల మాంసం ద్వారా ఈ వైరస్ మానవులకు విస్తరించిందని తాజాగా ఆక్స్ ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2013 నాటికి ప్రపంచ దేశాల్లో హెచ్ఐవీతో సతమతమవుతూ కొనఊపిరితో జీవిస్తున్న వారు 3.5 కోట్ల మంది ఉన్నారు.

  • Loading...

More Telugu News