: ప్రపంచ అణు సరఫరాదారుల కూటమిలో భారత్ కు సభ్యత్వం?
ప్రపంచ అణ్వస్త్ర సరఫరాదారుల కూటమి(ఎన్ఎస్ జీ)లో భారత్ కు చోటు దక్కేందుకు మార్గం సుగమమైంది. అంతేకాక క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లోనూ సభ్యత్వానికి భారత్ అతి చేరువలో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాతో జరిపిన భేటీ దీనికి దోహదం చేసింది. ఇరు దేశాధినేతల మధ్య భేటీ సందర్భంగా ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ రెండు కూటముల్లో భారత్ కు సభ్యత్వం లభించాల్సిన ఆవశ్యకతను ఒబామా అంగీకరించారు. దీంతో ఔషధ, అంతరిక్ష యానాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ వినియోగించుకునేందుకు మార్గం సుగమమైందనే చెప్పాలి. ఈ రెండు కూటముల్లో సభ్యత్వం కోసం సుదీర్ఘ కాలంగా భారత్ చేస్తున్న యత్నాలు ఫలించనున్నాయి.