: తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్న మహిళ అరెస్ట్
శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్న ఓ మహిళను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైను వద్ద కరపత్రాలను పంచుతున్న సదరు మహిళను విజిలెన్స్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నిషేధాజ్ఞలను అతిక్రమించి ఆ మహిళ ఇతర మతానికి చెందిన కరపత్రాలను పంపిణీ చేశారని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు వారు వివరించారు.