: భారత పురుషుల కబడ్డీ జట్టుకు స్వర్ణం
ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణపతకం సాధించింది. పురుషుల కబడ్డీ విభాగంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో భారత్ 27-25 తేడాతో ఇరాన్ పై విజయం సాధించింది. దీంతో భారత్ కు ఆసియా క్రీడల్లో 11వ స్వర్ణం లభించినట్లయింది. దీనికి కాస్త ముందు భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఒకే రోజు, కబడ్డీలో భారత్ కు రెండు స్వర్ణపతకాలు దక్కడం విశేషం.