: పండుగ పూట ప్రయాణికులను దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్!
దసరా పర్వదినాన ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు అధిక చార్జీల పేరిట ప్రయాణికులను దోచుకుంటున్నారు. పండుగ పూట నెలకొన్న రద్దీని ఆసరా చేసుకున్న ట్రావెల్స్ యజమానులు దోపిడీకి తెరతీశారని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణం కంటే రెండింతల చార్జీలను ట్రావెల్స్ యజమానులు వసూలు చేస్తున్నా రవాణా శాఖాధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తూ ఒంగోలులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ పై దాడులు చేసిన రవాణా శాఖాధికారులు పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో బస్సులను సీజ్ చేయడంతో పాటు బస్సుల యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. గురువారం ఉదయం మొదలైన దాడులు శుక్రవారం ఉదయం మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో రవాణాశాఖాధికారుల దాడులు కొనసాగుతున్నాయి.