: మహిళలూ... మీకు జీన్స్ వద్దు: యేసుదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు
మహిళలు జీన్స్ ధరించడాన్ని ప్రముఖ నేపథ్యగాయకుడు యేసుదాస్ తప్పుబట్టారు. మహిళలు జీన్స్ ధరించడం భారత సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్న ఆయన, జీన్స్ ధరించడం ద్వారా మహిళలు ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తారని కూడా వ్యాఖ్యానించారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిండుదనంతో కూడిన వస్త్రాలనే ధరించాలని ఆయన మహిళలకు సూచించారు. నిరాడంబరత్వం, మంచితనం భారత మహిళల్లోని గొప్ప లక్షణాలని, వారు జీన్స్ ధరించడం భారత సంస్కృతికి వ్యతిరేకమని చెప్పారు. ఇదిలా ఉంటే, మహిళలకు జీన్స్ వద్దంటూ యేసుదాస్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు.