: భారత మహిళా కబడ్డీ జట్టుకు బంగారు పతకం
ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా భారత మహిళా కబడ్డీ జట్టు శుక్రవారం బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో పది బంగారు పతకాలు చేరినట్లైంది. శుక్రవారం జరిగిన ఫైనల్ పోటీలో ఇరాన్ జట్టును 31-21 స్కోరు తేడాతో భారత జట్టు మట్టికరిపించింది. తద్వారా ఆసియా కబడ్డీ మహిళా విభాగంలో భారత్ విజేతగా నిలిచి, బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది.