: రాజరాజేశ్వరి మాత అలంకరణలో దుర్గమ్మ తల్లి!
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం విజయవాడలోని కనకదుర్గమ్మ తల్లి రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి చివరి రూపమిదే. ఈ నేపథ్యంలో భక్త జనసందోహం విజయవాడను ముంచెత్తింది. అమ్మవారి చివరి రూపాన్ని దర్శించుకునేందుకు భక్త జన కోటి, ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్లలో బారులు తీరింది. దీంతో ఇంద్రకీలాద్రి పర్వతం భక్త జనసందోహంతో కిటకిటలాడుతోంది.