: భారత్ లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ డేటా సెంటర్... భాగ్యనగరిలోనే!


సాఫ్ట్ వేర్ రంగంలో రారాజుగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ డేటా సెంటర్ ను హైదరాబాదులో ఏర్పాటు చేసేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకుంది. క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం మైక్రోసాఫ్ట్ పరిశీలిస్తున్న నగరాల జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతోందట. ఇటీవలి తన భారత పర్యటనలో భాగంగా క్లౌడ్ డేటా సెంటర్ ను భారత్ లో ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, భారత్ లోని ఏ నగరంలో సదరు డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. తాజాగా కంపెనీ, తన క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన సౌలభ్యాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాలను పరిశీలించిన కంపెనీ, హైదరాబాదులోనే తన తొలి క్లౌడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అయితే 2015 లోగా భారత్ లో మొత్తం మూడు క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్న మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ తర్వాత ముంబై, బెంగళూరు నగరాల్లో తన తదుపరి డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుందని సమాచారం.

  • Loading...

More Telugu News