: 25 లక్షల విలువైన విగ్రహాలు స్వాధీనం
దేవాలయాల నుంచి పంచలోహ విగ్రహాలు మాయం చేసి విక్రయించే స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటలో పంచలోహ విగ్రహాల్ని విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 25 లక్షల రూపాయల విలువ చేసే విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.