: కొత్త సొబగులద్దుకున్న ట్యాంక్ బండ్


హైదరాబాదులో ప్రముఖ పర్యాటక ప్రాంతం ట్యాంక్ బండ్ సద్దుల బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా కొత్త సొబగులద్దుకుంది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఎటు చూసినా మహిళల కోలాహలం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడంతో పూల పల్లకిలు ఊరేగాయి. పూలతో అలంకరించిన కారు అందర్నీ ఆకర్షించింది. పౌరసంబంధాల అధికారులు తయారు చేసిన శకటాలు అందర్నీ అలరించాయి. 35 టన్నుల పూలు సాగరతీరాన రాశులుగా నిలిచాయి. అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షో పండగకు కొత్త ఆకర్షణగా నిలిచింది. లేజర్ వెలుగులు హుస్సేన్ సాగర్ తీరాన్ని వెలుగుల మయం చేశాయి. దీంతో వీక్షకులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News