: ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో కోల్ కతా... రాణించిన హైదరాబాద్ అల్లుడు


ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నిలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్ కు చేరింది. హైదరాబాదులోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించింది. హైదరాబాదు అల్లుడు షోయబ్ మాలిక్ 66 పరుగులతో రాణించగా, అతనికి డంక్ 39, బ్రిట్ 13, గుల్బీస్ 15 చక్కని సహకారమందించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన హోబర్ట్ హరికేన్స్ జట్టు కేవలం 140 పరుగులే చేసింది. 141 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోల్ కతా బ్యాట్స్ మన్ లో రాబిన్ ఉతప్ప 17, కలిస్ 54, మనీష్ పాండే 40, యూసఫ్ పఠాన్ 14 పరుగులు చేశారు. దీంతో కోల్ కతా ఫైనల్ కు చేరింది. చెన్నై, పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ విజేతతో కోల్ కతా ఫైనల్లో తలపడనుంది. ఏతావాతా ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ కు చేరిన రెండు జట్లు భారత్ వే కావడం విశేషం.

  • Loading...

More Telugu News