: బంగారం ఆభరణమే కాదు... ప్రాణాలు నిలుపుతుంది


బంగారం అనగానే మన కళ్లముందు మిరుమిట్లుగొలిపే నగలు సాక్షాత్కరిస్తాయి. బంగారాన్ని అలంకరణ వస్తువుగానే చూసిన ప్రజలకు, శాస్త్రవేత్తలు బంగారంతో మరో ప్రయోజనాన్ని చూపించారు. బంగారం అవసరంలో ఆదుకోవడమే కాదని, కొన్ని సార్లు ప్రాణాలను సైతం కాపాడుతుందని నిరూపించారు. గుండెపోటు వంటి వ్యాధుల కారణంగా దెబ్బతిన్న గుండెకు బంగారం నానోకణాలతో ప్యాచ్ వేసి ప్రాణాలు పోస్తామని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ శరీరంలోని జీవకణజాలాన్ని బంగారం నానోకణాలతో కలిపి సరికొత్త కణజాలాన్ని అభివృద్ధి చేసి దానిని దెబ్బతిన్న గుండె కణజాలం స్థానంలో అమర్చవచ్చని ఇజ్రాయెల్‌ లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ బయోటెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ శాస్త్రవేత్తలు తెలిపారు. వ్యాధిగ్రస్తుడి శరీరం నుంచి కొంత జీవకణజాలాన్ని తీసుకుని, దానికి బంగారం నానోకణాలను కలిపి ముందుగా ప్రయోగశాలలో అభివృద్ధి చేస్తారు. అలా చేసిన కణజాలాన్ని, గుండెలో దెబ్బతిన్న కణజాలం స్థానంలో ప్యాచ్ లాగా అమర్చుతారు. దీంతో రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుందని, రోగి శరీరం నుంచి తీసిన జీవకణజాలమే కనుక తొందరగా రోగి కోలుకుంటాడని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతో బంగారం ప్రయోగశాలలు, ఆసుపత్రుల్లో కూడా కనపడనుంది.

  • Loading...

More Telugu News