: విండీస్ తో వన్డే సిరీస్ కు రోహిత్ దూరమే?


ఇంగ్లండ్ టూర్ లో గాయపడిన రోహిత్ శర్మ విండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ లో ఆడే అవకాశాలు కనపడడం లేదు. అక్టోబర్ 8 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 30 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ ఫిట్ నెస్ లేమి అతని స్థానంపై అనుమానం రేకెత్తిస్తోంది. మిడిలార్డర్ లో సమర్థవంతంగా ఆడగలిగే రోహిత్, మంచి ఓపెనర్ గా కూడా రాణించగలడు. మంచి ఫీల్డర్ కూడా. దీంతో అతను విండీస్ సిరీస్ కు కోలుకుంటాడని బీసీసీఐ భావించింది. ఇంగ్లండ్ సిరీస్ లో గాయపడిన రోహిత్ కు వైద్యులు నాలుగు వారాల విశ్రాంతి సూచించారు. అనుకున్న ప్రకారమే చేతి వేలి గాయం తగ్గింది. కానీ, భుజం నొప్పి తిరగబెట్టింది. దీంతో వెస్టిండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ లో రోహిత్ ఆడేది అనుమానమే. చేతి వేలి గాయంతో ఇప్పటికే చాంపియన్స్ లీగ్ టి20 టోర్నమెంట్ అతడు దూరమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News