: బతుకమ్మల నిమజ్జనాన్ని ప్రారంభించిన కేసీఆర్
హైదరాబాదులోని ట్యాంక్ బండ్, బతుకమ్మ ఘాట్ వద్ద బతుకమ్మల నిమజ్జనం ప్రారంభమైంది. బతుకమ్మ ఘాట్ వద్దకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. బతుకమ్మల ఊరేగింపులో సీఎం కేసీఆర్ సతీమణి శోభ పాల్గొన్నారు. ఎల్బీనగర్ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మల ఊరేగింపు జరగనుంది. బతుకమ్మ ఉత్సవాల కోసం సుమారు 35 టన్నుల పూలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. 50 వేల బతుకమ్మలను సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం, తమ సంస్కృతి ప్రతిబింబించేలా శకటాలను కూడా ప్రదర్శించింది. కళాకారులు ఆటపాటలతో అలరించగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.