: గ్రేటర్ టీడీపీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పదిరోజుల డెడ్ లైన్!


'ఆపరేషన్ ఆకర్ష్'కు కేసీఆర్ డెడ్ లైన్ విధించారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని నగరంలో బలపడాలని టీఆర్ఎస్ గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, భారీ ఆఫర్లతో టీడీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించినప్పటికీ వారు దాగుడుమూతలు ఆడటం పట్ల కేసీఆర్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ లోకి రావాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు మరో వారం, పది రోజుల్లో వస్తే రావాలని, లేకపోతే అక్కరలేదని కేసీఆర్ వారికి తేల్చిచెప్పినట్టు సమాచారం. అక్టోబర్ రెండో వారంలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలను ఘనంగా నిర్వహించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఈ సమావేశాల్లోపు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలనే టీఆర్ఎస్ లోకి తీసుకుంటామని కేసీఆర్ వారికి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. కేసీఆర్ అల్టిమేటంతో తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ఆరెకపూడి గాంధీ లాంటి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం. ఓ వైపు టీడీపీతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, మరో వైపు అధికార పార్టీ ఊరింపుల మధ్య వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News