: అరసవెల్లిలో వరుసగా రెండోరోజు కూడా స్వామిని తాకని సూర్యకిరణాలు


మేఘాలు అడ్డుకోవడంతో శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం సూర్య కిరణాలు మూల విరాట్టును తాకలేదు. దీంతో, గురువారమైనా స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకుతాయని భక్తులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే, వరుసగా రెండురోజు కూడా మబ్బులు కమ్ముకోవడంతో భక్తులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. దీంతో, స్వామిని సూర్యుని వెలుగులో చూసి తరించాలనుకున్న భక్తులు నిరుత్సాహంతో వెనుతిరిగారు. ఏటా రెండుసార్లు ప్రభాత సమయంలో సూర్యుని లేలేత కిరణాలు గర్భగుడిలో స్వామి విగ్రహాన్ని తాకుతాయి. ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రతీ ఏడాది వేలాది మంది భక్తులు ఈ సమయానికి అరసవెల్లికి చేరుకుంటారు.

  • Loading...

More Telugu News