: తీర్పు తరువాత... ఇవీ జయలలిత వ్యాఖ్యలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన అనంతరం ఆమె కోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదులు, నిందితులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆమె చేసిన వ్యాఖ్యలను ఓ తమిళ పత్రిక ప్రకటించింది. "నేను స్వతహాగా ఆస్తిపరురాలిని, సినీ నటిగా ఎంతో సంపాదించాను. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే నాకు మంచి ఆస్తి ఉంది. నాకంటూ ఓ కుటుంబమే లేనప్పుడు అక్రమంగా ఆర్జించాల్సిన అవసరం ఏముంది? నాకున్న ఆస్తి అంతా తమిళనాడు ప్రజలే. అందుకే నాకున్న ఆస్తినంతా తమిళనాడు ప్రజలకే అంకితం చేస్తాను. ప్రజాకోర్టులో నన్ను ఢీకొనలేని కొందరు వ్యక్తులు కుట్రపన్ని ఈ కోర్టుద్వారా అక్రమ కేసులను బనాయించి ప్రతీకారం తీర్చుకున్నారు" అని జయ పేర్కొన్నారు. 1991-96 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పని చేసినప్పుడు అవినీతికి పాల్పడి, అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ, డీఎంకేతో బాటు సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు చేశారు. దాంతో 18 ఏళ్ల పాటు విచారించిన న్యాయస్థానం ఆమె 66.44 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని నిర్థారించిన సంగతి తెలిసిందే.