: జయలలిత...గాంధీ... మోడీలపై వర్మ ట్వీట్లు
'అంతా నా ఇష్టం...' అనే ధోరణిలో సామాజిక అనుసంధాన వేదికలపై కామెంట్లు చేస్తూ సంచలనం సృష్టించే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదాస్పద వ్యాఖ్యలతో ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యారు. 'గాంధీజీ బతికి ఉంటే ఎవరికి సపోర్ట్ చేసేవారు?' అంటూ ఒక ట్వీట్... 'అలా అయితే నరేంద్ర మోడీ గెలిచేవాడా?' అంటూ ఇంకో ట్వీట్... 'గాంధీజీ ఏమో తక్కువ బట్టలు ధరిస్తే...జయలలితకేమో పది వేల చీరలా?' అంటూ మరో సెటైరికల్ ట్వీట్ పేల్చారు. మరో ట్వీట్ లో 'గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చాడా? లేక దేశం గాంధీజీకి స్వాతంత్ర్యం ఇచ్చిందా? గాంధీజీ ఆశయాలను కనీసం పది మంది నేతలు అనుసరించినా దేశం ఈపాటికి ఎక్కడో ఉండేద'ని ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.