: మామ్మా... మీ కష్టాలు తీర్చడానికొచ్చా...నన్ను దీవించు: చంద్రబాబు


మహాత్ముడు జన్మించిన ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశాన్ని అభివృద్ధి బాటపట్టించేందుకు ప్రధాని సహా అంతా కంకణం కట్టుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు పింఛను అందజేశారు. పింఛన్ ను 200 రూపాయల నుంచి వెయ్యికి పెంచామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఓ వృద్ధ మహిళకు పింఛను అందజేశారు. ఈ సందర్భంగా బాబు ఆమెతో ముచ్చటించారు. ఆ సంభాషణ వారి మాటల్లోనే... "ఏం మామ్మా, నీకు పింఛన్ అందుతోందా?" "అందుతుంది బాబు, 200 ఇస్తున్నారు" "నీకు పింఛన్ పెంచాం తెలుసా? ఇకనుంచి నీకు 1000 రూపాయలు అందుతుంది. ఐదురెట్లు పెంచడంపై నీ అభిప్రాయం ఏంటి?" అయితే, ఆమెకు వినికిడి లోపం ఉండడంతో, సరిగా వినపడకపోవడంతో మరోసారి అడిగింది. బాబు నవ్వుతూ మళ్లీ అడగడంతో, "సంతోషంగా ఉంది" అని చెప్పింది. "మరి నాకేమిస్తావు?" అంటూ బాబు అడగడంతో ఆమె ఏం జవాబు చెప్పాలో తెలియక మిన్నకుండిపోయింది. దానికి చంద్రబాబునాయుడు హాయిగా నవ్వేసి "నీలాంటి వారికి సహాయం చేసే శక్తిని దేవుడు నాకు ప్రసాదించేలా దీవించు" అన్నారు. ఆమెకు అర్ధం కాకపోవడంతో మరోసారి నవ్వేశారు. తరువాత అర్ధం చేసుకున్న ఆమె బాబును "చల్లగా ఉండమని" దీవించింది. మామ్మను ముట్టుకుంటే ఎముకలే తగులుతున్నాయని, ఇలాంటి వారికి మంచి చేసిన ప్రతిసారీ తనలో కొత్త ఉత్సాహం వస్తుందని, పేదరికాన్ని నాశనం చేయాలని అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News