: మోడీ నోట మెగాస్టార్ ‘స్టాలిన్’ మాట!


‘‘మీరు ముగ్గురికి సాయం చేయండి. ఆ ముగ్గురిని, మరో ముగ్గురికి చొప్పున సాయం చేయమనండి’’ ఎక్కడో విన్నంటుందే అనుకుంటున్నారా? వినడమేనా, ఈలలు కూడా వేశాంగా! 'స్టాలిన్' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పే మాటే కదా ఇది. అవును... దాని ప్రస్తావన ఇప్పుడెందుకంటారా? ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే బాట పట్టారు మరి. స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రారంభం సందర్భంగా దేశానికి మోడీ ఓ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలన్నదే ఆ పిలుపు సారాంశం. అయితే దానిని ఆయన మన మెగాస్టార్ స్టాలిన్ లా చెప్పారు. స్వచ్ఛ్ అభియాన్ లో భాగంగా రోడ్ల పైకి వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోడీ ఓ తొమ్మిది మంది పేర్లను చదివారు. అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అనిల్ అంబానీ, ప్రియాంకా చోప్రా, కమల్ హసన్, సల్మాన్ ఖాన్, బాబా రాందేవ్, శశి థరూర్, మృదులా సిన్హా, తారక్ మెహతాలున్నారు. తన పిలుపుతో ఈ కార్యక్రమంలోకి వచ్చి, తలా మరో తొమ్మిది మందిని పిలవాలని మోడీ వారిని కోరారు. తద్వారా దేశంలోని ప్రతి వ్యక్తి ముందుకు వస్తారని, స్వచ్ఛ్ భారత్ దిగ్విజయమవుతుందని మోడీ చెప్పారు. సూత్రం బాగానే ఉంది. మరి, మోడీ పిలిచిన తొమ్మిది మంది ఎప్పుడు బయటకొస్తారో చూద్దాం!

  • Loading...

More Telugu News