: 'స్వచ్ఛ భారత్' దేశం మీద ప్రేమతో చేపట్టిన కార్యక్రమం: మోడీ


ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం ప్రారంభోత్సవంలో నరేంద్రమోడీ ప్రసంగించారు. కేవలం ప్రభుత్వాల వల్ల మాత్రమే 'పరిశుభ్ర భారతావని' సాధ్యం కాదని, దీనికి ప్రజలందరి మద్దతు అవసరమని మోడీ అన్నారు. మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్ర్యం అందించినప్పటికీ, ఆయన కల అయిన 'పరిశుభ్ర భారత్' మాత్రం ఇంకా నెరవేరలేదన్నారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదని, దేశం మీద ప్రేమతో చేపట్టిన కార్యక్రమం అని ఆయన తెలిపారు. 'పరిశుభ్ర భారత్' కార్యక్రమం కేవలం పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థలది మాత్రమే కాదని, ప్రజలందరికీ ఇది చెందుతుందని ఆయన తెలిపారు. అందరూ కలిసి పనిచేస్తే ఇది సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు. 'చెత్త వేయను.. చెత్త వేయనీయను' అని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని మోడీ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News