: నిలకడగా ఉన్న డాలర్ శేషాద్రి ఆరోగ్యం, తప్పిన ప్రాణాపాయం


నిన్న తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రి పాలైన తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) డాలర్ శేషాద్రి ఆరోగ్యం నిలకడగా ఉందని జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు. ఆయన ఆరోగ్యం నిన్నటి కంటే చాలా మెరుగుపడిందని, ప్రాణాపాయం తప్పినట్టేనని జేఈవో తెలిపారు. మరో 4 గంటల్లో శేషాద్రికి వెంటిలేటర్ ను తొలగించే అవకాశం ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్యం మరికాస్త కుదుటపడ్డ తర్వాత, మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలిస్తామని శ్రీనివాసరాజు వెల్లడించారు.

  • Loading...

More Telugu News