: కేసీఆర్ సంచలన నిర్ణయం...తెలంగాణకు అధికారిక వాస్తు కన్సల్టెంట్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా ఓ వాస్తు కన్సల్టెంట్ ను నియమించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవి కోసం ప్రముఖ వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజ పేరును ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేసీఆర్ సూచనల మేరకు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ఆయన పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ఫైల్ పంపింది. ఈ ఫైల్ ప్రస్తుతం ఆర్థికశాఖ దగ్గర ఉంది. సుధాకర్ తేజను వాస్తు కన్సల్ టెంట్ గా నియమిస్తే ఆయనకు ఎలాంటి హోదా ఇవ్వాలనే విషయమై అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్ కు వాస్తు, జ్యోతిష్యాలపై బాగా గురి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రతీ సందర్భంలో ఆయన వాస్తు, జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తున్నారు.