: మరోసారి ఒకే వేదికను పంచుకోనున్న కేసీఆర్, చంద్రబాబు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు మరోసారి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ప్రతి ఏటా, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ దసరా సందర్బంగా 'అలయ్ బలయ్'ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని అద్దం పట్టేలా ఈ ఉత్సవం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి 'అలయ్ బలయ్' కావడంతో ఈ ఏడాది ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కెేసీఆర్, చంద్రబాబు, వెంకయ్యనాయుడులతోపాటు గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రివర్గంలోని మరికొంతమంది సీనియర్ మంత్రులు కూడా పాల్గొంటారని బండారు దత్తాత్రేయ తెలిపారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమపాటలతో 'అలయ్ బలయ్' థూంథాంగా జరిగేది. కానీ, ఈసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రమంత్రులు హాజరవుతుండడంతో కార్యక్రమం కాస్త క్లాస్ గా జరగనుంది.