: 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని హైదరాబాదులో ప్రారంభించారు. రాజ్ భవన్ కాలనీలో ఉద్యోగులతో కలిసి గవర్నర్ దంపతులు రోడ్డు వూడ్చారు. అంతేకాక నరసింహన్ పార పట్టి గడ్డి తొలగించారు. అనంతరం రాజ్ భవన్ ఉద్యోగులతో ఆయన 'స్వచ్ఛ భారత్' ప్రతిజ్ఞ చేయించారు.