: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా డీఏ పెంపు!
తెలుగు రాష్ట్రాలు రెండింటిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఇంట దసరా వెలుగులు మెరిశాయి. ఉద్యోగుల కరవు భత్యాన్ని పెంచుతూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం ఒకేరోజు ఉత్తర్వులు జారీ చేశాయి. అంతేకాక రెండు రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు 5.99 శాతం కరవు భత్యాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు పెంచిన కరవు భత్యాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు నిర్ణయించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, అక్టోబర్ మాసం డీఏను మాత్రమే ఉద్యోగులకు నగదు కింద చెల్లించనున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నాయి.