: వ్యాపార నైపుణ్యంలో మోడీ, మిగతా ప్రధానుల కంటే మెరుగు: శరద్ పవార్


తనదైన శైలిలో దూసుకుపోతూ ప్రపంచ దేశాల అధినేతలతో పాటు కార్పోరేట్ దిగ్గజాలను సమ్మోహితులను చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, యూపీఏ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన శరద్ పవార్ కీర్తిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘‘మోడీ వ్యాపార, నిర్వహణ నైపుణ్యాలు మిగిలిన ప్రధానుల కంటే మెరుగైనవి. అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించడంతో పాటు పలు కొత్త ఒప్పందాలకు తెరతీసిన మోడీ, మిగిలిన ప్రధానుల కంటే ముమ్మాటికీ మెరుగైనవారే’’నంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో 15 ఏళ్ల నాటి బంధాన్ని తెంచుకుని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరి పోరు సాగించనున్న శరద్ పవార్ పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకునే దిశగా పయనిస్తోందన్న వార్తల నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News