: 'స్వచ్ఛ భారత్' ప్రారంభ కార్యక్రమంలో రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తిన మోడీ
'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు ఉండే వాల్మీకీ సదన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోడీ, కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం ఉదయం బాపూ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోడీ, నేరుగా వాల్మీకీ సదన్ చేరుకున్నారు. సదన్ లోని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మోడీ చీపురు పట్టారు. వారితో కలిసి రోడ్డు వూడ్చి చెత్త ఎత్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.