: నేడు హైదరాబాద్ లో సద్దుల బతుకమ్మ వేడుకలు


తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వేడుకల్లో నేడు చివరి అంకం సద్దుల బతుకమ్మ వేడుకను నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి వేడుకలను కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటిదాకా జిల్లాల్లో బతుకమ్మ కోలాహలం చోటుచేసుకోగా, నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్ లో బతుకమ్మ సంరంభం మొదలు కానుంది. తెలంగాణ ప్రభుత్వం నేటి వేడుకలకు దాదాపు రూ.9 కోట్లకు పైగా నిధులను వెచ్చించనుంది. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి తరలిరానున్న ప్రజలతో నగరం నేడు కళకళలాడనుంది. బుధవారం నాటికే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం తర్వాత ఎల్బీ స్టేడియం నుంచి మొదలయ్యే బతుకమ్మ నిమజ్జన ఊరేగింపు అత్యంత కోలాహలం మధ్యన ట్యాంక్ బండ్ చేరుకోనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో పాల్పంచుకోనున్నారు. పెద్ద సంఖ్యలో జనం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News