: కేదార్ నాథ్ దేవాలయం చుట్టూ రక్షణ గోడ
ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయం చుట్టూ రక్షణగా మూడంచెల గోడను నిర్మించాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు విడుదల చేసిన ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. గతేడాది తీవ్ర వరదల కారణంగా దెబ్బతిన్న ఆలయం ఈ వేసవిలో పునఃప్రారంభమైంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గోడను కట్టాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సిఫారసు చేసింది. అంతేగాక, ఆలయానికి సమీపంలో కేదారపురి టౌన్ షిప్ ను కూడా నిర్మించనున్నారట. త్వరలో నిర్మాణం ప్రారంభం కానుంది.