: డాక్టర్ లాగా వచ్చి... బ్యాగులు నొక్కేసిన కి'లేడీ'


హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో ఓ కి'లేడీ' హల్ చల్ చేసింది. సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ వేషంలో వచ్చిన మాయలాడి అందిన కాడికి మహిళా డాక్టర్ల బ్యాగులు నొక్కేసింది. సుమారు పది మంది హ్యాండ్ బ్యాగ్ లను సర్దేసిన ఆమె చల్లగా జారుకుంటుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఆమె బ్యాగ్ ను వారు తనిఖీ చేయడంతో స్టెతస్కోపు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు దర్శనమిచ్చాయి. దీంతో, ఆగ్రహం చెందిన మహిళా డాక్టర్లు ఆమెకు దేహశుద్ధి చేశారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News