: మనీషా కొయిరాల మళ్లీ వస్తోంది!


క్యాన్సర్ కారణంగా రెండేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉంటున్న నటి మనీషా కొయిరాల మళ్లీ నటించనుంది. గతంలో కూడా ఇలా చాలాసార్లు వార్తలొచ్చినా ఈసారి మనీషా మేనేజర్ ఈ విషయాన్ని ఖరారు చేశాడు. త్వరలోనే ఆమె కెమెరా ముందుకు రానుందని, బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి తదుపరి ప్రాజెక్టులో నటించనుందని చెప్పాడు. ఈ మేరకు మాట్లాడుతూ, "మనీషా పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు చాలా బాగుంది. ప్రస్తుతం కొన్ని స్క్రిప్టులు చదువుతోంది. రాజ్ కుమార్ తదుపరి చిత్రం దాదాపు ఖరారైంది. ఆ స్క్రిప్టు తనకు బాగా నచ్చింది. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగులో పాల్గొంటుంది. ఇందులో లీడ్ పాత్రను తను చేస్తుంది" అని మేనేజర్ సుబ్రతో ఘోష్ వెల్లడించాడు. దాంతో, మనీషా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందనుకోవచ్చు.

  • Loading...

More Telugu News