: తెలంగాణలో ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత
తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన ఉద్యమ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. అనంతరం 690 మందిపై కేసులు ఎత్తివేస్తూ, ఆ మేరకు రూపొందించిన ఫైలుపై సంతకం చేశారు. కేసులకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమర్పించనున్నారు.