: 10 వేల ఎన్జీఓలకు కేంద్రం నోటీసులు!


విదేశాల నుంచి భారీ ఎత్తున నిధులను అందుకుంటూ ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్న 10 వేలకు పైగా స్వచ్ఛంద సంస్థల ఎన్జీవోల)కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఏళ్ల తరబడి ఆదాయపన్ను వివరాలను వెల్లడించకుండా దాటవేస్తున్న సదరు ఎన్జీవోల లైసెన్సులను ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ ఆ నోటీసుల్లో కేంద్రం హెచ్చరించింది. 2009 నుంచి దేశంలోని 10,331 స్వచ్ఛంద సంస్థలు తమ ఆదాయపన్ను వివరాలను వెల్లడించడం లేదు. అయితే, విదేశాల నుంచి మాత్రం భారీగానే నిధులను అందుకుంటున్నాయి. దీనిపై దృష్టి సారించిన హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదేశాలతో ఆ శాఖ అధికారుల్లో కదలిక వచ్చింది. తక్షణమే ఆదాయపన్ను వివరాలు అందించడంతో పాటు జాప్యానికి గల కారణాలను కూడా తెలియజేయాలని సదరు నోటీసుల్లో ఎన్జీఓలకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News