: చినరాజప్పకు 'బర్త్ డే' విషెస్ చెప్పిన బాబు
ఏపీ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే విషెస్ చెప్పారు. గత ఎన్నికల ముందు వరకు చినరాజప్ప టీడీపీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించేవారు కాదు. అయితే, అధినేత చంద్రబాబుకు విధేయుడని ఈయనకు పేరుంది. పైగా ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి కావడంతో కీలక పదవులు వరించాయి. చినరాజప్ప తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.