: నటి శ్వేతాబసు కోసం ఓ పాత్ర రాయాలనుంది: దర్శకుడు విశాల్ భరద్వాజ్


పన్నెండేళ్ల కిందట బాల నటిగా హిందీలో దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందించిన 'మక్డీ' చిత్రంతో నటి శ్వేతాబసు ప్రసాద్ సినీ రంగానికి పరిచయమైంది. వ్యభిచారం కేసులో ఇటీవల ఆమెను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మీడియా ద్వారా ఆ విషయం బాగా సంచలనమైంది. దీనిపై దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్పందిస్తూ శ్వేత విషయంలో చాలా బాధపడుతున్నానని, ఆందోళన చెందుతున్నానని అన్నాడు. శ్వేత చాలా టాలెంట్ ఉన్న నటి అని చెప్పాడు. ఇలాంటి వివాదంలో తనెలా చిక్కుకుందో తెలియదన్న విశాల్, ఈ విషయంపై మీడియా రిపోర్ట్ చేసిన విధానం తనను మరింత బాధించిందని పేర్కొన్నాడు. ఇలాంటప్పుడు మీడియా సదరు అంశాన్ని పక్కదారి పట్టే విధంగా చేస్తుందని, ఆమె వెనుకున్న వ్యక్తుల గురించి మీడియా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించాడు. భవిష్యత్తులో శ్వేతాబసుతో పని చేస్తానన్న విశాల్, తనకోసం ఓ పాత్రను రూపొందించాలనుకుంటున్నట్టు తెలిపాడు.

  • Loading...

More Telugu News