: మహిళల సరసన బతుకమ్మను తలపై పెట్టుకున్న బాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదు కూకట్ పల్లిలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టజీవుల పండుగ బతుకమ్మ అని అభివర్ణించారు. ఇదో పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బతుకమ్మను తలపై పెట్టుకుని ఫొటోలకు పోజిచ్చారు. ఈ ప్రాంత ఆడబిడ్డలు పూలతో పూజిస్తూ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించారని పేర్కొన్నారు. అంతేగాకుండా, తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు బాబు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, భౌగోళికంగా విడిపోయినా, మనమంతా ఒక్కటిగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలుగుజాతిని కాపాడుకోవాలని ఆనాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, ఆయన ఆశయాన్ని మనం నెరవేర్చాలని సూచించారు. కూకట్ పల్లి తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, ఇకపైనా అలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారయన.

  • Loading...

More Telugu News